వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోదుగుల..

వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోదుగుల..

అధికార తెదేపాకు
చెందిన మరొక నేత మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి వైసీపీలో చేరారు.శనివారం వైసీపీ అధినేత
జగన్‌ సమక్షంలో మోదుగుల వైసీపీలో చేరారు.అనంతరం మాట్లాడుతూ..సమైక్యాంధ్ర కోసం ఉత్తరాది
ఎంపీల చేతిలో దెబ్బలు తిన్నానని అయినప్పటికీ తెదేపా తమకు సరైన గుర్తింపు,గౌరవం ఇవ్వలేదని
ఆరోపించారు.తనను కొట్టినపార్టీ నేతలతోనే తెదేపా అధినేత చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం
తమకు మరింత అవమానకరంగా మారిందన్నారు.తనలాంటి నిస్వార్థ నేతకు టికెట్‌ ఇవ్వకపోవడం తెదేపా
దురదృష్టమని వైసీపీ అధినేత జగన్‌ ఆదేశిస్తే గుంటూరు నుంచి తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌పై
పోటీ చేస్తామన్నారు.గుంటూరు జిల్లాలో తెదేపాను నామరూపాల్లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.తమ
సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో
చేతులు కలిపి మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos