
న్యూఢిల్లీ: ‘కాపలాదారుని’ అని ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నా ప్రధాని మోదీ అసలు కాపలాదారులు (వాచ్మెన్)ల సంక్షేమాన్ని తాత్సారం చేసారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జార్ఖండ్లో చాలీ చాలని జీతాలతో బతుకులీడుస్తున్న పది వేలమంది వాచ్మెన్లు ఆందోళన చేస్తున్న ఒక వార్త కత్తరింపును రాహుల్ శుక్రవారం ఫేస్బుక్లో పెట్టారు. ‘కనీసం మీరు ఎవరి వెనుక దాక్కుంటున్నారో వాళ్ల గురించి అయినా పట్టించుకోండి’ అని చురక లంటించారు.