పట్నా : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జేడీయూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. కేవలం అధికారం కోసమే ఇరు పార్టీలు జట్టుకట్టాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ అసెంబ్లీ ఎన్నికలపుడు నితీష్పై మోదీ చేసిన ఆరోపణల వీడియోను ట్విటర్ లో విడుదల చేసారు. ఇందులో… ‘నితీష్ హాయంలో బిహార్ మరింత వెనుకబడుతోంది. జేడీయూ పాలనలో అవినీతి తారా స్థాయికి పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున దోచుకున్నారు. ఐదేళ్ల పాలనలో నితీష్ కుమార్ 60 స్కాములకు పాల్పడ్డారు. వాటి విలువ దాదాపు 30 వేలకోట్లు. బీజేపీ అధికారంలోకి వస్తే వాటిపై విచారణకు ఆదేశిస్తాం’ అని మోదీ ఆరోపించారు.