కోల్‌కతా : కరోనాపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించినపుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శలకు దిగారు. బీజేపీ ప్రభుత్వం పచ్చిమోసకారి ప్రభుత్వమని ఆరోపించారు. బెంగాల్‌కు కరోనా వ్యాక్సిన్ ఇప్పటి వరకూ పంపలేదని దుయ్యబట్టారు. కరోనా తిరిగి విజృంభిస్తోందని, అయినా ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. ‘‘తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ఎన్నికల సమ యంలో బిహార్ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ వారు అందజేశారా? అందచేయ లేదు. వారు అబద్ధమాడారు.’’ అని మమత మండి పడ్డారు.