న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోది మంగళవారం తన బ్లాగ్‌లో విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మత, కులాల ప్రాతి పదికన విభజిస్తూ వారసత్వ సంస్కృతిని ప్రోత్సహిస్తోందని ఆ వ్యాసంలో దుయ్యబట్టారు. అసమానత, కులాల పరంగా సమాజాన్ని విడదీయడాన్ని గాంధీ పలు సందర్భాల్లో వ్యతిరేకించగా సమాజాన్ని విడ గొట్టేందుకు కాంగ్రెస్ ఎన్నడూ వెనుకాడ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో కుల ఘర్షణలు, దళితుల ఊచ కోతలు యధేచ్చగా సాగాయని తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతల మనస్తత్వాన్ని పసిగట్టి నందునే గాంధీ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని స్వాతంత్య్రానంతరం సూచించారని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి మరో పేరుగా దిగజారిందని దుయ్య బట్టారు.