మోదీ నియంత

మోదీ నియంత

ముంబై : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని శివసేన పత్రిక-సామ్నా యోధుడిగా అభివర్ణించింది. రాహుల్ గాంధీని చూసి అధికార భాజపా జంకుతోందని పేర్కొంది. ‘ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు రాహుల్ని చూసి భయపడుతున్నారు. గాంధీ కుటుంబాన్ని అపఖ్యాతి పాలుజేయాలని చూస్తున్నారు. కానీ అవేవీ పనిచేయవు. ఒక్క వ్యక్తి తనకు వ్యతిరేకంగా ఉన్నా నియంత భయపడతాడు. ఆ వ్యక్తే నిజాయితీగా ఉంటే ఆ భయం వందరెట్లు రెట్టింపు అవుతుంది. కేంద్రం రాహుల్ని చూసి వందరెట్లు జంకుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ రాహుల్ గాంధీని ఎంత విమర్శించినా, వాటన్నింటినీ తట్టుకొని నిలబడుతున్నారు. రాహుల్ ను ఒక అసమర్థ నేతగా బీజేపీ పదే పదే ప్రచారం చేస్తోంది. అయినా, సమయం చిక్కినప్పుడల్లా రాహుల్ బీజేపీకి తగిన సమాధానం చెబుతూనే ఉన్నారు. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి పైకి లేచినట్లుగా విప క్షం కూడా ఏదో ఒక రోజు పైకి లేస్తుంది. ఇందుకు చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపైకి కేంద్రం ఉసిగొల్పుతోంద’ని మండిపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos