మోడీకి గడ్డు పరిస్థితేనా…?

మోడీకి గడ్డు పరిస్థితేనా…?

సార్వత్రిక ఎన్నికల తర్వాత హంగ్‌ లోక్‌సభ ఏర్పడుతుందని ఇండియా టుడే-కార్వీ; ఏబీపీ-సీవోటర్‌ సర్వేలు తేల్చి చెప్పాయి. కేసీఆర్‌, జగన్‌, నవీన్‌ పట్నాయక్‌, పళనిస్వామి తదితరులు మద్దతు ఇచ్చినా ఎన్‌డీఏ మళ్లీ అధికారం చేపట్టలేదని అంచనా వేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 237 స్థానాల్లో విజయం సాధిస్తుందని మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ సర్వే అంచనా వేసింది. 2014 ఎన్నికలతో పోలిస్తే 99 సీట్లను కోల్పోనుంది. గత ఎన్నికల్లో కేవలం 60 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ఈసారి తన సీట్లను 166కు పెంచుకుంటుందని తెలిపింది. ఎన్‌డీఏ, యూపీఏ కూటముల్లో లేని పార్టీలు 140 సీట్లను సాధిస్తాయని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇవి 13 సీట్లను కోల్పోనున్నాయి. ఏ పార్టీ కానీ, కూటమి కానీ మేజిక్‌ మార్కు అయిన 272 సీట్లు సాధించే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్‌ పార్లమెంటు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఎస్‌పీ, బీఎస్‌పీ, పీడీపీ, టీఎంసీ పార్టీలు యూపీఏకు మద్దతు ఇస్తే దానిదే అధికారమని విశ్లేషించింది. ఎన్‌డీఏకు కేసీఆర్‌, పళనిస్వామి, జగన్‌రెడ్డి, నవీన్‌పట్నాయక్‌ కలిసినా మేజిక్‌ మార్కుకు ఒక సీటు దూరంలో ఆగిపోతుందని అంచనా వేయడం గమనార్హం. యూపీఏ 33 శాతం ఓట్లను సాధిస్తే.. ఎన్‌డీఏ 35 శాతం ఓట్లను దక్కించుకుంటుందని తెలిపింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజక వర్గాల్లో 13,179 మందిని సర్వే చేసింది. జనవరి ఏడో తేదీన కేంద్ర కేబినెట్‌ ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసింది. వాటి ప్రభావం ఈ సర్వేలో ప్రతిఫలించే అవకాశం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos