ప్రకాశ్ రాజ్ పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు

ప్రకాశ్ రాజ్ పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు

బహుభాష నటుడు
ప్రకాశ్‌రాజ్‌పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు
సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్న ప్రకాశ్‌రాజ్‌ మార్చ్‌12వ తేదీన బెంగళూరులోని
మహాత్మ గాంధీ సర్కిల్‌లో మీడియా ప్రతినిధులు భావస్వేచ్చ ప్రకటన ర్యాలీ నిర్వహించారు.అసలే
తన స్నేహితురాలు,పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ,బీజేపీ
పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రకాశ్‌రాజ్‌ బీజేపీపై,ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.అంతటితో
ఆగకుండా ఎన్నికల్లో తనకు ఓటు వేయాలంటూ కోరారు.ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలను వీడియో
తీసిన కొంతమంది ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌కు పంపించారు.వీడియోలు చూసిన అధికారులు
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపు కార్యక్రమం పూర్తయి
అందరూ వెళ్లిపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.అయితే వీడియోల ఆధారంగా కబ్బన్‌పార్క్‌ పోలీసులు
ప్రకాశ్‌రాజ్‌పై ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసుకున్నారు.ర్యాలీ కోసం ప్రవీణ్‌,అభిలాష్‌
అనే ఇద్దరు వ్యక్తులు అనుమతి తీసుకున్నప్పటికీ ర్యాలీకి ఆహ్వానించిన ప్రకాశ్‌రాజ్‌
ఎన్నికల ప్రచారం చేయడంతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రకాశ్‌రాజ్‌తో
పాటు ప్రవీణ్‌,అభిలాష్‌లపై కూడా కేసు నమోదు చేసుకున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos