పుర్భ స్థలి ఉత్తర్: ‘దేశంలో కోవిడ్ కేసులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోదీదే. దీనికి బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేయా లని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘కోవిడ్ కేసులు ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం మోదీనే. ఒక ప్రణాలిక లేదు. పరిపాలనా సామర్థ్యం లేదు. పూర్తిగా అసమర్థత. కరోనాను అరికట్టేందుకు ఆయన ఏం చేయలేదు, ఇతరుల్ని ఏం చేయనివ్వలేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.