ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కరణం బలరాం, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి, తెలంగాణలో యాదవ రెడ్డి స్థానాలకు కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురూ శాసన సభకు ఎన్నికయ్యారు. తెరాస ఎమ్మెల్సీగా ఉన్న యాదవ రెడ్డిపై పార్టీ ఫిరాయించారనే ఆరోపణపై అనర్హత వేటు పడింది. కనుక ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కానుంది.