తిరుమల: శాసనమండలి సభ్యుడు ఒకరు, చెన్నైకి చెందిన సలహా మండలి మాజీ సభ్యుడు శిష్టాచార (ప్రోటోకాల్) దర్శనాలను దుర్వి నియోగం చేసినట్లు తితిదే విచారణలో తేలింది. దీంతో వారి సిఫార్సుల్ని నిశితంగా పరిశీలించాలని తీర్మానించినట్లు అధికార్లు ఇక్కడ తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో ఇతరులకు దర్శనాలు కల్పించారని వివరించారు. భవిష్యత్తులో వారికి ప్రోటోకాల్ దర్శన టికెట్లను జారీ చేసేటప్పుడు వారు కుటుంబ సభ్యులా కాదా అనే వివరాల్ని ముందుగా సమర్పించాలని ఆంక్షల్ని విధించారు. తన కార్యాలయం జారీ చేసిన టికెట్లనూ పరిశీలించాలని నిఘా అధికారుల్ని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆదేశించారు. 5 మంది దళారీలు పౌర సంబంధాల అధికార్ల ముసుగులో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి న్యాయ స్థానంలో హాజరు పరిచారు.