అమరావతి : ఇంగ్లీష్ మీడియంపై తెదేపా నేత చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లడారు. ‘చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ఏ మీడియంలో చదువుకున్నారు. ఇప్పుడు లోకేశ్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు. అసలు చంద్రబాబు పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఇతరుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా?తెలుగులోనే చదివితే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడానికే చంద్రబాబు మాట్లాడుతున్నారు. చదువుకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నార’న్నారు.