భోపాల్ : పౌరసత్వ నూతన చట్టం దుర్వినియోగమైతే పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానిపైనే దేశ వ్యాప్తంగా ఆందోళన సాగు తోందని ముఖ్య మంత్రి కమల్ నాథ్ బుధవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘దీని పై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి ఏం చెబుతు న్నారనేది మాకు అనవసరం. ఇద్దరూ వేర్వేరు విషయాలపై మాట్లా డుతున్నారు. ఈ చట్టంలో ఏం పెట్టారనేది కాదు. చట్టంలో ఏం పెట్ట లేదనేదే ప్రశ్న. ఈ చట్టం దేనికి ఉపయోగపడుతుందనేని ప్రశ్న కాదు. దుర్వినియోగమైతే పర్యవ సా నాలు ఏమిటనేదే ఆందోళన కలిగి స్తోంద’ న్నారు.