బాబు గారి ఇంగ్లీష్ వింటే మతిపోవాల్సిందే….

బాబు గారి ఇంగ్లీష్ వింటే మతిపోవాల్సిందే….

కొత్త
కొత్త పదాలు కనిపెట్టడంలో మంచు ఫ్యామిలీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు పోటీ పడుతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.గతంలో
బ్రీఫ్డ్‌ మీ పదాన్ని కనిపెట్టిన చంద్రబాబు తాజాగా ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష
వేదికపై చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు ఒక రేంజులో ఆడుకుంటున్నారు.తెలుగు వాక్యాలను
యథాతథంగా అనువాదం(ట్రూ ట్రాన్స్‌లేషన్‌)చేస్తే వాటిఅర్థం ఎలా మారుతుందో చంద్రబాబు
చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుందని విమర్శిస్తున్నారు.అవేంటో ఇపుడు చూద్దాం..

”You have given parliament మట్టి 
and Yamuna water on our fa
ce, now he is saying all these things in విభజన చట్టం they have completed” ఇక మరో టీవీ చానల్ తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్నీకావు. తను లోకేష్ తండ్రిగా, భువనేశ్వరి భర్తగా, దేవాన్ష్ తాతగా గర్విస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. గర్విస్తే గర్వించారు కానీ.. దాన్ని చెప్పిన తీరే మరీ దారుణంగా ఉంది.

‘Iam father of Lokesh and I am working for him, Iam proud
to be my grandson Devansh’’
బాబుగారి నుంచి జాలువారిన ఇంగ్లిష్ ముక్కకు అర్థం ఏమిటో ఇంగ్లిష్ బాగా తెలిసిన వాళ్లే అర్థం చేసుకోవాలి. ఇంగ్లిష్ ప్రవాహంలో చంద్రబాబు నాయుడు తను తన కొడుకు కోసం పని చేస్తున్నట్టుగా భలే చెప్పారని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

ఇంగ్లిష్ విన్నాకా వచ్చే మరో సందేహం ఏమిటంటే.. బాబుగారికి ఎలాగూ హిందీ రాదు. ఇంగ్లిష్ ఇలా ఉంది. కమ్యూనికేషన్ తో ఈయన విదేశాలకు వెళ్లినప్పుడు ఎలా మేనేజ్ చేస్తుంటారు, ఇంగ్లిష్ తోనేలక్షల కోట్లపెట్టుబడులు పట్టేస్తూ ఉన్నారా.. రాహుల్ లాంటి వాళ్లతోనూ.. ఢిల్లీలో ఇతర పార్టీ నేతలతోనూ ఎలా మాట్లాడుతూ ఉంటారు? ఫోన్లుచేసి ప్రధానమంత్రులను ఎలా మార్చి ఉంటారు అనే సందేహాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos