మోదీజీ ఈ ఖ్యాతి కూడా మీ ఖాతాలోకేనా…!

మోదీజీ ఈ ఖ్యాతి కూడా మీ ఖాతాలోకేనా…!

లక్నో : ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతం కావడాన్ని
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత విజయంగా ప్రచారం చేసుకోజూస్తున్నారని బీఎస్పీ అధినేత్రి
మాయావతి విమర్శించారు. బుధవారం భారత శాస్త్రవేత్తలు ఈ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం
చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ప్రదాని రాజకీయాలు చేస్తున్నారంటూ మాయావతి మండిపడ్డారు.
ఈ క్షిపణి సామర్థ్యాన్ని భారత్‌ నిరూపించుకుందంటూ మోదీ ప్రకటించిన కొద్ది సేపటికే ఆమె
ట్విటర్‌ వేదికగా స్పందించారు. అంతరిక్షంలోని ఓ ఉపగ్రహాన్ని కూల్చివేసే ప్రయోగాన్ని
విజయవంతంగా నిర్వహించినందుకు మన శాస్త్రవేత్తలకు అభినందనలు. అయితే మోదీ దీనిని కూడా
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉపయోగించుకోవడాన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల సంఘం దీనిపై
చర్యలు తీసుకోవాలి..అని ఆమె డిమాండ్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos