జై పూర్: రాజస్థాన్లో శాసనసభ సమావేశాలు నిర్వహణకు అనుమతించాలనే అశోక్ గహ్లోత్ ప్రభుత్వ వినతికి గవర్నర్ కల్రాజ్ మిశ్రా తిరస్కరించారు. గహ్లోత్ ప్రతి పాదనను మిశ్ర తిరస్కరించటం ఇది రెండో సారి. బల నిరూపణ కోసం శాసన సభ సమావేశానికి అనుమతివ్వాలని తొలుత చేసిన వినతి ఆరు వివరణల్ని అడిగారు. సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ పలు సవరణలతో మరో ప్రతిపాదన పంపించింది. తాజాగా దాన్ని కూడా తిరస్కరించారు.