హోసూరు ప్రాంతంలో పడిపోయిన పుదీనా ధరలు

హోసూరు ప్రాంతంలో పడిపోయిన పుదీనా ధరలు

హోసూరు : లాక్‌డౌన్‌ కారణంగా హోసూరు ప్రాంతంలో పుదీనా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి ప్రాంతంలో రైతులు పుదీనా ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కావడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. రవాణా స్తంభించడంతో కోతకొచ్చిన పుదీనాను అమ్ముకొనే దిక్కులేక సూలగిరి ప్రాంత రైతులు పంటను తోటల్లోనే వదిలివేశారు. తోటల్లోనే పంట పూర్తిగా కుళ్ళిపోయింది దీంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. లాక్‌డౌన్ కారణంగా పుదీనా పంటను అమ్ముకునే వీలు లేకపోయిందని, దీని వల్ల తీవ్రంగా నష్టపోయామని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos