మైనారిటీల గుర్తింపునకు దేశమే ప్రాతిపదిక

న్యూ ఢిల్లీ: ఐదు వర్గాలను మైనారిటీలుగా గుర్తిస్తూ కేంద్రం 26 ఏళ్ల కిందట జారీ చేసిన అధికారిక ప్రకటన చెల్లుబాటును సవాల్ చేస్తూ న్యాయ వాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు అత్యున్నత న్యాయ స్థానం మంగళవారం తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. మైనా రిటీలుగా గుర్తించేందుకు దేశ జనాభా కాకుండా రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని, మైనారిటీలను రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ధారించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ఉపాధ్యాయ కోరారు. ‘మతాన్ని దేశ జనాభా ఆధారంగానే పరి గణనలోకి తీసుకోవాలి’ అని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  నేష నల్ కమిషన్ ఫర్ మైనారిటీ యాక్ట్, 1992 ప్రకారం ముస్లిం లు, క్రిష్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనారిటీలుగా గు ర్తిస్తూ అక్టోబర్ 23, 1993న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos