ఢిల్లీ : ఇక్కడి లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 7.25 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తొమ్మిది ఫైరింజన్లతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. స్వల్ప అగ్నిప్రమాదమేనని వారు తెలిపారు. ఈ సంఘటన వల్ల ప్రధాని నివాసానికి దారి తీసే మార్గాలన్నిటినీ తాత్కాలికంగా మూసివేశారు.