అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ మంత్రి వర్గ కూర్పును సిద్ధం చేశారు. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఓ మైనారిటీకి స్థానం కల్పించారు. ఏడుగురు బీసీలు, అయిదుగురు ఎస్‌సీలు, నలుగురు కాపులు, నలుగురు రెడ్లు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరికి చోటు దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినట్లు సమాచారం. 25 మందితో కూడిన మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి, గవర్నర్‌కు అందజేశారు. రెండున్నరేళ్ల తర్వాత 20 మందిని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని శాసన సభా పక్ష సమావేశంలో జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన అయిదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. శనివారం మధ్యాహ్నం 11.49 గంటలకు సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కొత్త మంత్రులు వీరే
- బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి-విజయనగరం)
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-కర్నూలు)
- కొడాలి నాని (కృష్ణా)
- మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-చిత్తూరు)
6.మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు)
- ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట-శ్రీకాకుళం)
- పుష్ప శ్రీవాణి(కురుపాం-విజయనగరం)
- కురుసాల కన్నబాబు ( కాకినాడ గ్రామీణ-తూర్పు గోదావరి)
10.బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఒంగోలు)
11.అవంతి శ్రీనివాస్ ( భీమిలి-విశాఖ)
- పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
13.విశ్వరూప్ (అమలాపురం)
- ఆళ్ల నాని (ఏలూరు-కృష్ణా)
- చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట)
16.ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-గుంటూరు)
- మేకపాటి గౌతం రెడ్డి (ఆత్మకూరు-నెల్లూరు)
- తానేటి వనిత (కొవ్వూరు)
- పేర్ని నాని (కృష్ణా)
- వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ)
- గుమ్మనూరు జయరాం (ఆలూరు-కర్నూలు)
- నారాయణ స్వామి (గంగాధర నెల్లూరు-చిత్తూరు)
- అంజాద్ బాషా (కడప)
- శంకర నారాయణ (పెనుకొండ)
- అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు)