ఎక్కడికి వెళ్లినా లవ్ ఎఫైర్ గురించో లేక పెళ్లి గురించో అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని భావించాడో ఏమోకానీ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా అన్నింటికి గతవారం సమాధానం ఇచ్చేశాడు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నానంటూ.. సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ఇక తన గర్ల్ఫ్రెండ్ మిహీకా బజాజ్ ని కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశాడు. అంతేగాక మిహీకాతో దిగిన సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది’ అని అలా చెప్పాడో లేదో.. నిశ్చితార్థం అంటూ హడావిడి మొదలైంది. వీరిద్దరూ ప్రేమ గురించి అలా బయట పెట్టారో లేదో.. ఆ వెంటనే ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో లవ్ మేటర్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఎంతో గోప్యంగా ఇంతకాలం దాచిన మిహీక.. తాజాగా తన కాబోయే భర్త రానా.. పేరును తన పేరును షార్ట్ కట్ లో చేతి పై టాటూ వేయించుకుందట. ఆ టాటూ ఫోటో ఈరోజు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎప్పుడైతే రానాతో ప్రేమ విషయం బయట పడిందో.. అప్పుడే టాటూకి మెరుగులు దిద్దింది. నా పేరులోని మొదటి అక్షరం ‘ఆర్’ని, తన పేరులోని మొదటి అక్షరం ‘ఎం’ని తన చేతిపై టాటూ వేయించుకుంది. రెండు అక్షరాల మధ్య లవ్ సింబల్తో ఉంది. మిహీకా బజాజ్ వేయించుకున్న ఈ టాటూ ఫొటో బాగా వైరల్ అవుతోంది. కాగా, వారిద్దరు కుటుంబాలు తాజాగా హైదరాబాద్లో కలుసుకుని నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలపై చర్చించుకున్నాయి.