జోధ్పుర్: భారత వాయుసేనలో అతి శక్తిమంతమైన మిగ్-27 యుద్ధవిమానం చరిత్ర పుటలకే పరిమితమైంది. మూడు దశాబ్దా లకు పైగా చెరగని సేవలందించిన ఈ లోహ విహంగాలకు శుక్రవారం భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. జోధ్పుర్ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్ -27 విమానాలు చివరిసారి గగనవిహారం చేశాయి. తుదిసారిగా నింగికెగిరిన ఈ విమానా లు నేల వాలిన తర్వాత జల ఫిరంగులతో గౌరవ వందనం సమర్పించారు. కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన ఈ లోహ విహంగా లను భారత వైమానిక దళంలో బహుదుర్గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధ విమానాల వినియోగానికి తెర పడిం ది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు.