కూలిన మిగ్-21

కూలిన మిగ్-21

జయపుర: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం  మిగ్‌-21 రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం కూలిపోయింది.  పైలట్‌ ప్రాణాపాయాన్ని తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. రోజువారి కసరత్తులో భాగంగా బికనేర్‌ సమీపంలోని నాల్‌ వాయు సేన స్థావరం నుంచి బయల్దేరిన మిగ్‌-21 విమానం కాసేపటికే కూలింది. సాంకేతిక లోపం దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos