త్వరలో కనుమరుగవనున్న వర్డ్‌ప్యాడ్‌

త్వరలో కనుమరుగవనున్న వర్డ్‌ప్యాడ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ‘వర్డ్ప్యాడ్’కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్ప్యాడ్’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ చూరగొన్నది. డాక్యుమెంట్ రైటింగ్లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్తులో విడుదల చేసే విండోస్ వెర్షన్లలో ‘వర్డ్ప్యాడ్’ ఉండదని, అప్డేట్ వెర్షన్ కూడా రాదని, దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను ఉపయోగించుకోవాలని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇటీవలే సరికొత్త ఆప్షన్లతో అప్గ్రేడ్ వెర్షన్ ‘నోట్ప్యాడ్’ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos