ముంబై: జియో లో మైక్రోసాఫ్ట్ 2.5 శాతం వాటాను కొనుగోలు చేయనుందని ముంబై మింట్ వెల్లడించింది. రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలిపింది. దేశంలో సేవలను మరింత విస్తరించ నున్నామని, అజూర్ క్లౌడ్ సేవల వ్యాపారానికి డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందని మైక్రో సాఫ్ట్ ఇది వరకే ప్రకటించింది.