టోక్యో : ఉద్యోగులతో వీలైనంత ఎక్కువ సమయం చాకిరీ చేయించి లాభాలు దండుకోవచ్చనే ఆలోచన నిష్ప్రయోజనమైనదిగా తేలింది. వారాంతంలో బహుళ జాతి సంస్థలు రెండు వారాంతపు సెలవులు ఇచ్చిన తర్వాత ఉత్పాదకత పెరిగింది. దరిమిలా వారానికి మూడుల పాటు సెలవు ఇస్తే బాగుం టుందేమోనని ఆలోచిస్తున్నాయి. జపాన్లో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల సెలవు ప్రకటించి మెరుగైన ఫలితాల్ని సాధిం చింది. ఉద్యోగులు ఇల్లు, కార్యాలయాల పనుల మధ్య సమ తూకం పాటించేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ ఒక నెలపాటు 2300 మంది ఉద్యో గులకు మూడు రోజుల సెలవు విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇది అద్భుత ఫలితాలను రాబట్టింది. ఉత్పాదకత ఏకంగా 39.9 శాతం పెరిగింది. 23.1 శాతం విద్యుత్ ఆదా అయ్యింది. వారంలో నాలుగు రోజులే పని చేయడంతో లక్ష్యాల పూర్తి సమావేశాలు రద్దయ్యాయి. ముఖాముఖి భేటీల స్ధానంలో వర్చువల్ సమావేశాలు జరిగాయి. నెలరోజల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టిన న వారానికి మూడు రోజుల సెలవు తమకు చాలా సంతృప్తికరంగా ఉందని 92.1 శాతం మంది ఉద్యోగులు సంబరపడుతున్నారు. మరోసారి ఈ తరహా నాలుగు రోజుల పని దినం పద్దతిని పరిశీలించనుంది. ఇది అన్ని చోట్లా మెరుగైన ఫలితాలిస్తుందని చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు