న్యూఢిల్లీ: ముందూ, వెనుకా చూసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో స్పందించిన పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ నగుబాట్ల పాలయ్యారు. మియా ఖలిఫా అనే పోర్న్ తారను భారతీయురాలిగా భావించిడమే ఆయన చేసిన పొరబాటు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసిస్తున్న భారతీయుల జాబితాను ఒకరు ట్విటర్లో ఎక్కించారు. అందులోని భారతీయుల జాబితాలో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు కూడా ఉంది. వాటి గురించి పట్టించుకోని రెహ్మాన్ ట్వీట్లో మియా ఖలీఫాతో పాటు జాబితాలోని అందరికీ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ దీవెనలు అందించారు. దీంతో ఆయన ట్రోల్ అవుతు న్నా రు. మియాను దేవుడు దీవించుగాక అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమైంది.