హైదరాబాదు: మెట్రో యాజమాన్యం ఛార్జీలను పెంచటంతో ప్రయాణికుల సంఖ్య 5 శాతం మేర తగ్గింది. నిరసనలు వ్యక్తం కావడంతో మే 25 నుంచి 10 శాతం మేర ఛార్జీలు తగ్గించినా సరే సగటున రోజుకు దాదాపు 25 వేల వరకు ప్రయాణికులు తగ్గిపోయారు. సోమవారం ప్రయాణికుల సంఖ్య 4.60 లక్షలకు మించ లేదు. కొన్ని సోమవారాల్లో అయితే ఆ సంఖ్య 4.40 లక్షలు, అంతకంటే తక్కువగానే ఉంటుంది. ఉదయం, సాయంత్రం మినహా మిగతా సమయాల్లో చాలా మెట్రోలు ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. వారాంతాల్లోనూ ఇదే పరిస్థితి.