కదిలే గుర్రాలతో సాహసం చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా!

కదిలే గుర్రాలతో సాహసం చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా!

తెలిసోతెలియకో చేసే సాహసాలు కొన్నిసార్లు ప్రాణాలమీదకే తెస్తుంటాయి.ముఖ్యంగా వాహనాలపై ప్రయాణించే సమయంలో ఇటువంటి సాహసాలకు ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో పూణెలో జరిగిన ఓ వీడియో చూస్తే అర్థమవుతుంది.రోడ్డుపై రథంతో రెండు గుర్రాలు అత్యంత వేగంతో దూసుకుపోతుంటే వాటిని నియంత్రించడానికి ఇద్దరు యువకులు బైకుపై వెంబడిస్తారు.ఈ క్రమంలో గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో బైకు గుర్రాలను ఢీకొట్టడంతో వెనుకవైపు కూర్చొని గుర్రాలను అందుకోవడానికి ప్రయత్నించిన యువకుడు అమాంతం రథం కింద పడిపోతాడు.ఈ క్రమంలో రథం చక్రాలు యువకుడిపై నుంచి దూసుకెళ్లాయి.అయితే ఘటనలో యువకుడు స్వల్పగాయాలతో బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos