అమరావతి: పోలవరం జలాశయం ప్రధాన కట్ట, జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఈ పనుల విలువ రూ.4,987 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీని కంటే 12.6 శాతం తక్కువ మొత్తం రూ.4,358 కోట్లతో చేపట్టేందుకు మేఘా సంస్థ సంసి ద్ధత వ్యక్తం చేసి ఎల్ 1గా నిలిచింది. దీంతో ఖజానాకు రూ.629 కోట్ల మేరకు ఆదా అయ్యింది. జలవనరులశాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు మే ఘా ఇంజినీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్ను దాఖలు చేసింది. ప్రీ బిడ్ సమావేశానికి దాదాపుఎనిమిది 8 సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసే నాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది.