సైరా చిత్రం ఘన విజయం ఇచ్చిన ఊపుతో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంపై దృష్టి సారించారు.రొటీన్ కథలతోనే ఏదోఒక సామాజిక సందేశం అందించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుత్వంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవినీతి,అక్రమాల గురించి స్పృశించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల, చిరు చిత్ర కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలలో జరుగుతున్న అవినీనీతిని కొరటాల టచ్ చేయబోతున్నారట. విలువైన దేవాలయాల సంపద మాయం కావడం, దేవాలయ భూములని రాజకీయ నాయకులూ కబ్జా చేసుకోవడం లాంటి అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట.ఆసక్తికరంగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ శాఖలో జరుగుతున్న అవినీతి చూసి చిరంజీవి బడా రాజకీయ నాయకులకే ఎదురుతిరిగే విధంగా ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.