ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన పవన్ ఈనెల 14వ తేదీన రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. దీంతోపాటు నియోజకవర్గాల్లో జనసేన పార్టీపై ప్రజల అభిప్రాయం,అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నింటిపై పవన్‌కళ్యాణ్ దృష్టి సారించారు.ఈ క్రమంలో మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోయినా మెగా కుటుంబంలో ఒకవ్యక్తిగా కలసిపోయిన బన్నివాసుకు జనసేన నుంచి టికెట్ లభించనుందన్న వార్త ప్రస్తుతం సినీ,రాజకీయ వర్గాల్లో్ హాట్‌టాపిక్ మారింది.ఆవిర్భావ సభ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పవన్‌కళ్యాణ్ వేసిన కమిటీలో బన్నివాసు పేరు అధికారికంగా ప్రకటించడం ఈ చర్చలకు తావిచ్చింది.అల్లుఅర్జున్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బన్నివాసు మెగా కాంపౌండ్‌లోకి ప్రవేశించి మెగా కుటుంబంలో వ్యక్తిగా మారిపోయాడు.చాలా చిత్రాల్లో బన్నివాసు సహనిర్మాతగా కూడా వ్యవహరించాడు.దీంతో పవన్‌కళ్యాణ్‌తో కూడా సాన్నిహిత్యం పెంపొందించుకున్న బన్నివాసు తాజా ప్రకటనతో జనసేనలో కూడా అధికారిక సభ్యుడయ్యాడు.జనసేన తరపున పాలకొల్లు నియోజకవర్గం టికెట్‌ను బన్నివాసుకు ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్‌కళ్యాణ్,అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లినపుడు అభిమానులతో ర్యాలీ ఏర్పాటు చేసింది బన్నివాసునే.పాలకొల్లులో బన్నివాసుకు మంచిపేరు కూడా ఉండడంతో పాలకొల్లు టికెట్ బన్నివాసుకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది..