బూతులతో రెచ్చిపోయిన మీనా..

  • In Film
  • November 19, 2019
  • 143 Views
బూతులతో రెచ్చిపోయిన మీనా..

బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనంతరం అందం,అభినయంతో తెలుగుతో పాటు దక్షణాదిలోని అన్ని పరిశ్రమల్లో క్రేజ్‌ తెచ్చుకున్న గత తరం హీరోయిన్‌ మీనా ఇన్నేళ్లలో ఎప్పుడూ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం,ద్వంద్వార్థాల దృశ్యాల్లో నటించడం,డైలాగులు చెప్పడం చూడలేదు.అయితే తాజాగా ఓ బోల్డ్ కంటెంట్ ఉన్న తమిళ వెబ్ సిరీస్‌లో నటించిన మీనా అందులో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. అమాయకంగా ఉంటే నవ్వులు పూయిస్తూ.. తిట్ల దండకంతో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది.‘కరోలిన్ కామాక్షి’ అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో మీనా బూతులు తిడుతూ ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్‌తో పాటు మద్యం సేవించే సన్నివేశాల్లో కూడా నటించింది.ట్రైలర్ చివర్లో మీనా మద్యం మత్తులో చెప్పే బూతు డైలాగులు వైరల్ అవుతున్నాయి. మీనా ఏంటి ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos