వేటి ధరలు తగ్గుతాయంటే

వేటి ధరలు తగ్గుతాయంటే

న్యూ ఢిల్లీ:కస్టమ్స్‌ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఏడు రకాల సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగా 36 రకాల ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తొలగించింది. దీంతో క్యాన్సర్‌ మందులు, సర్జికల్‌ పరికరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. లిథియం బ్యాటరీలపైనా కేంద్రం పన్నును తొలగించింది. తద్వారా టీవీలు, మొబైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గనున్నాయి. అలాగే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందించనుంది.

బడ్జెట్‌ తర్వాత ధరలు తగ్గే వస్తువులు ఇవే..

క్యాన్సర్‌, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాల కస్టమ్స్‌ డ్యూటీని తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడికల్‌ పరికరాల ధరలు కూడా తగ్గనున్నాయి.   బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతానికి తగ్గించడంతో టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. లిథియం బ్యాటరీలపై పన్నును తొలగించడంతో బ్యాటరీల ధరలు తగ్గనున్నాయి. తద్వారా మొబైల్‌ ఫోన్ల బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గుతాయి. కోబాల్ట్‌ పౌడర్‌తో పాటు సీసం, జింక్‌తో పాటు మరో 12 ఖనిజాలను బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించింది.నౌకల తయారీకి అవసరమైన ముడిసరుకులపై కూడా బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని మినహాయించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos