రోజూ కాసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి మేలని చెబుతారు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో దీనికి మరో అంశాన్ని జోడించారు. పూర్తి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వివరాలను ‘ఎవిడెన్స్ బేస్ట్ మెంటల్ హెల్త్’ అనే జర్నల్లో ప్రచురించారు. రోజువారీ పనుల్లో భాగంగా కలిగే ఒత్తిళ్లు, నొప్పుల నుంచి కూడా బయటపడొచ్చని ఆ అధ్యయనంలో వివరించారు. ధ్యానం వల్ల మనిషి మానసికంగా చాలా ధృడంగా ఉంటారని తెలిపారు. ఫలితంగా ఆలోచనలు, ప్రవర్తనపై పూర్తిగా అదుపులో ఉంటాయని తేల్చారు.