మంత్రి పదవి ఆశ చూపారు..అయినా లొంగలేదు..

మంత్రి పదవి ఆశ చూపారు..అయినా లొంగలేదు..

తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాల్లో తెరాస జెండా ఎగురవేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్న తెరాస అధినేత కేసీఆర్‌ అందులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,కీలక నేతలను గులాబి పార్టీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో తెరాసను ఒకేఒక్క స్థానానికి పరిమితం చేసిన ఖమ్మం జిల్లాపై కేసీఆర్‌ ప్రధానంగా దృష్టి సారించారు.ఈ క్రమంలో ఖమ్మంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను గులాబి పార్టీలోకి తేవడంలో సఫలీకృతుడైన కేసీఆర్‌ తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విషయంలో మాత్రమే సఫలీకృతం కాలేకపోయాడు.. తాము గాలం విసరాలే కానీ పడని నేత ఉండని భావిస్తున్నతరుణంలో అందుకు భిన్నంగా మెచ్చా ఉండటం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక పట్టాన నచ్చలేదని చెబుతారు. అందుకే.. మెచ్చాను పార్టీలోకి తెచ్చేందుకు అదేపనిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కారు ఎక్కించే పనిలో భాగంగా ఒత్తిళ్లను అంతకంతకూ పెంచుతున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. మీడియా ముందుకు వచ్చిన మెచ్చా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ లోకి చేరిన పక్షంలో తనకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు.  అయితే.. తనకు టీఆర్ ఎస్ లో చేరటం ఇష్టం లేదని.. డబ్బుకు.. పదవులకు లొంగే వ్యక్తిని తాను కానని మెచ్చా స్పష్టం చేశారు. మెచ్చా తరహాలో చాలామంది మాటలు చెప్పి..ఆ తర్వాత చెంగున దూకేయటాన్ని మర్చిపోలేం. మరి.. మెచ్చా ఒకే ఒక్కడిగా ఉండిపోతారా? 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos