లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): సొంత ప్రచారం కోసం రూ.కోట్లాది గా ప్రజా ధనాన్ని ప్రధాని మోదీ దుర్వి నియోగం చేసారని బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం ఆరోపించారు. ‘పునాది రాళ్లేయటంలో మోదీ తీరిక లేకుండా గడిపారు. ప్రచారం కోసం రూ.3044 కో ట్లు ఖర్చు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లాంటి వెనుక బడిన రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలు అందించడానికి ఈ ప్రజా ధనం ఉపయోగ పడేది. కానీ, భాజపాకు ప్రచారమే ముఖ్యం.. ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు’ అని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ భాజపా ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించా రు.‘భాజపా, మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్ని స్తున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఈ సమస్యలపై చర్చ జరగడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.