మంచి రోజులు ఎందుకు రాలేదు?

మంచి రోజులు ఎందుకు రాలేదు?

లఖ్‌నవూ :‘దేశాభివృద్ధిని అటక ఎక్కించిన భాజపా  లోక్‌సభ ఎన్నికల్లో  గెలిచేందుకు  జాతీయత, దేశ భద్రత విషయాలపైనే ఆధార పడుతోంది.   ఇది సమస్య కాదు.  గత ఎన్నికల ప్రణాళికలో దేశంలోని కోట్లాది మంది పేదలు, కూలీలు, రైతులు, నిరుద్యోగ యువతకు అచ్చేదిన్‌ వస్తుందంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో  ప్రజలకు తెలపాలి. అభివృద్ధి అజెండాను మర్చిపోయి, ఓటర్ల సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తున్నారు’ అని ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి  సోమవారం మాయావతి ట్వీట్‌ చేశారు.‘కశ్మీర్‌లో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించట్లేదు. కశ్మీర్‌ లో పాటించాల్సిన విధానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని దీన్నిబట్టి స్పష్టంగా  తెలుస్తోంది. ఏక కాలంలో ఈ రెండు ఎన్నికలు నిర్వహించేలా మన భద్రతా బలగాలు పని చేయ గలవు. ఇదే ప్రజలకు ఉపశమనం., కేంద్ర ప్రభుత్వ తర్ఖం చౌకబారు   పిల్లచేష్టల్లా ఉంది’ అని మాయావతి మరో ట్వీట్‌లో విమర్శించారు.  కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఆహ్వానించదగిన విషయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని, పారిశ్రామిక వేత్తల సానుకూల సర్కారు అని ఆరోపించారు. దేశంలో మోదీ సర్కార్‌ శాంతి, భద్రతలను నాశనం చేస్తోందని, 130 కోట్ల మంది భారతీయులకు ఓ మంచి ప్రభుత్వం కావాల్సి ఉందని, కొత్త ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించేదిగా, దాని విలువలను కాపాడేదిగా ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఆహ్వానించదగిన విషయమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos