
లక్నో: కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ఇక్కడ తేల్చి చెప్పారు. కూటమి కోసం ఏడు స్థానాలను ఖాళీగా వదలినట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను
ఖండించారు.భాజపాను పరాజయం పాల్జేసేందుకు ఎస్పీ – బీఎస్పీ కూటమి సరిపోతుందని నమ్మకంగా చెప్పారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛగా అభ్యర్థులను పోటీకి నిలుపుకోవచ్చని పేర్కొన్నారు. తమ మద్దతు దారుల్లో అనవసరంగా అయోమయ్యాన్ని సృష్టించ వద్దన్నారు. ఎస్పీ – బీఎస్పీ కూటమి కోసం ఏడు కీలక స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించలేదని కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. అవి-ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ (మెయిన్‌పురి), ఆయన కోడలు, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ (కనోజ్), అఖిలేశ్ (అజంగఢ్), ఆర్‌ఎల్‌డీ ఛీఫ్ అజిత్ సింగ్ (బాగ్‌పట్ లేదా ముజఫర్‌నగర్) ఆయన కుమారుడు జయంత్ సింగ్ (మధుర లేదా బాగ్‌పట్) పోటీ చేస్తున్న, ములాయం సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫిరోజాబాద్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి దింపడం లేదు. కాంగ్రెస్‌కు కూటమితో కుదిరిన రహస్య ఒప్పందం నిజమనేందుకు కాంగ్రెస్ ప్రకటన సాక్షమని భాజపా నేతలు వ్యాఖ్యానించారు.