బాబు హిందూ వ్యతిరేకి

బాబు హిందూ వ్యతిరేకి

అమరావతి: ‘చంద్ర బాబు నాయుడు హయాంలో హిందు మతానికి జరిగిన అవమానం ఎన్నడూ జరగలేదు. ఆనాడు మంత్రిగా మాణిక్యాల రావు ఉన్నారు. ఇది ప్రజలకు తెలుసు‘ అని వైకాపా పార్లమెంటు సభ్యుడు మల్లాది విష్ణు శుక్రవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ‘మాణిక్యాలరావు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పని చేసినప్పుడే దుర్గ గుడిలో ,శ్రీ కాళహస్తి లో తాంత్రిక పూజలు జరిగాయి. విజయవాడలో యాభై హిందూ దేవాల యాలను కులదోశారు. గోదావరి పుష్కరాల్లో మారణ హోమం ఎవరి హయాంలో జరిగాయో అందరికీ తెలుస’న్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మంచి పనులతో తెదేపా. భాజపాలకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నార’ని మండి పడ్డారు. జగన్ను హిందూ వ్యతిరేకిగా మాజీమంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యాఖనించడాన్ని తప్పు బట్టారు. దేవుడు భూములు అప్పనంగా కాజేసిన చరిత్ర తెదేపాదేనని దుయ్యబట్టారు. సదావర్తి దేవుడు భూముల కాజేసిన విషయాన్ని మరచిపోయారాని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆర్టీసీ బస్ టికెట్ల పై హజ్ యాత్ర గురించి ప్రచురించటాన్ని గుర్తు చేశారు. నేటికీ వాటినూ ఆర్టీసీలో పంపిణీ చేస్తున్నారని చెప్పారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెదేపా వలలో పడుతున్నారని విమర్శించారు. పచ్చ మాధ్యమాలతో కలిసి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos