పారిస్:జైషే మహమ్మద్ ఉగ్ర వాద సంస్థ అధినేత మసూద్ అజార్ ఆస్తుల్ని
జప్తు చేయదలచినట్లు ఫ్రాన్స్ దేశ ఆర్థిక, ఇంటీరియర్, విదేశీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా
శుక్రవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపాయి. ఉగ్రవాదిగా
మసూద్ అజార్‌ను అభివర్ణించింది. ఉగ్ర వాదాన్ని ఫ్రాన్స్ తేలిగ్గా తీసుకోదని, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారికి గట్టి గుణ పాఠాన్ని చెబుతుందని పేర్కొంది.‘ భారత్‌లో 14 ఫిబ్రవరి 2019న భయంకరమైన దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది భారత భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ముమ్మాటికి జైషే మహమ్మద్ సంస్థే కారణమని, ఈ సంస్థ వల్ల ప్రమాదముందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. జైషే సంస్థ ఉగ్రవాదానికి చెందిన సంస్థగా ఐరాస 2001లోనే గుర్తించింది. దీన్నే ఫ్రాన్స్ అనుసరిస్తోంది ’ అని ఆ ప్రకటనలో తెలిపింది.