మళ్లీ వచ్చిన మాస్క్లు

మళ్లీ వచ్చిన మాస్క్లు

లక్నో: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆరు జిల్లాలు- గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్, హపూర్, మీరట్, బులంద్షహర్, లక్నోల్లో ఫేస్ మాస్క్లు తప్పని సరి చేసి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు ధరించకుంటే జరిమానా విధించటాన్ని ఆపేయాలని ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇటీవల నిర్ణయించాయి. ఏప్రిల్ 1 నుంచి మాస్క్లు తప్పనిసరి కాదంటూ యూపీ ప్రభుత్వం ప్రకటించింది . కేంద్రం సైతం ఫేస్మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నాయి. గత 24 గంటల్లో గౌతమ్ బుద్ధ్ నగర్లో కొత్తగా 65 , ఘజియా బాద్లో 20, లక్నోలో 10 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పరిస్థితిని నిశితంగా గమనించాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos