హైదరాబాద్ : పెళ్లికి వచ్చిన ఓ మహిళ లిఫ్ట్ గుంతలో పడి మరణించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడలోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో కమలమ్మ అనే మహిళ మూడో అంతస్తు నుంచి కిందకు రావడానికి లిఫ్ట్ బటన్ నొక్కింది. లిఫ్ట్ రాక ముందే డోర్ తెరుచుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించి లిఫ్ట్ గుంతలో పడిపోయింది. ఆమె కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వారు. ఫంక్షన్ హాలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆందోళనకు దిగారు. అప్పటికే కన్వెన్షన్ హాలు యజమానికి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.