దారుణంగా కూలిన మార్కెట్లు

దారుణంగా కూలిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారం కుప్పకూలాయి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందనే భీతితో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి దిగజారాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,472కి, నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 10,741 కి దిగ జారాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో టెక్ మహీంద్రా (1.57%), టీసీఎస్ (1.33%), హిందుస్థాన్ యూని లీవర్ (1.03%), హెచ్సీ ఎల్  టెక్నాలజీస్ (0.58%) లబ్ధి పొందారు. యస్ బ్యాంక్ (-13.91%), వేదాంత లిమిటెడ్ (-7.76%), బజాజ్  ఫైనాన్స్ (-4. 39%),  టాటా మోటార్స్ (-4.14%), ఓఎన్జీసీ (-3.55%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos