
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఆరంభమ య్యాయి. స్వల్ప వ్యవధిలోనే పుంజుకుంది. ఉదయం 9.40గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 38,250 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు , 11,484 వద్ద డాలరుతో రూపాయి మారకం విలువ 69.03 వద్ద ట్రేడ్ అయ్యాయి. స్థిరాస్థి, బ్యాంకులు,సమాచార సాంకేతిక రంగ షేర్లు లాభాలు గడించాయి. జి ఎంటర్టైన్మెంట్స్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండియా బుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్, హెచ్పీసీఎల్, ఐఓసీ, గెయిల్ ,డీఎల్ఎఫ్ , డెల్టా కొర్పొ బాగా లాభపడుతున్నాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, టాటా స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల పాలయ్యాయి. అమెరికా ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కోనుందన్న అంచనాలతో యూరోపియన్ మార్కెట్లు నెగిటివ్గా ముగిసాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. నేడు మార్చి డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచించారు.