నాలుగో రోజూ మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు- మంగళవారమూ లాభాల్ని గడించాయి. వ్యాపారాలు ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఒడిదు డుకుల మధ్య కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత ఐటీ కంపెనీల షేర్లకు కొనుగోళ్లు పెరగటంతో లాభాల్ని మూటగట్టు కున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు లాభపడి 55,792కి, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 16,615కి పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా (3.21%), నెస్లే ఇండియా (2.30%), టైటాన్ కంపెనీ (2.18%), టీసీఎస్ (2.02%), ఇన్ఫోసిస్ (1.95%) లాభాల్ని పొందాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.83%), ఎన్టీపీసీ (-1.43%), భారతి ఎయిర్ టెల్ (-1.25%), టాటా స్టీల్ (-1.16%), ఎల్ అండ్ టీ (-1.00%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos