
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,531 వద్ద, సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో 38,450 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 30,034 పాయింట్లను దాటింది. ఫార్మా, మెటల్, రియల్టీ , ప్రభుత్వ బ్యాంకింగ్ బాగా లాభ పడుతు న్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, ఎయిర్టెల్, ఐవోసీ, ఇన్ఫ్రాటెల్, ఐబీ హౌసింగ్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, ఎస్బీఐ, వేదాంతా షేర్లు బాగా లాభపడ్డాయి. జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడో రోజు కూడా లాభ పడుతోంది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, టెక్ మహీంద్రా, ఐషర్ స్వల్పంగా ,ముడి చమురు ధరలు పెరగటంతో చమురు ఆయిల్ షేర్లతోపాటు ఇన్ ఫ్రా షేర్లు కాస్త ఎక్కువగా నష్ట పోతున్నాయి. ఆసియా మార్కెట్ల షేర్లు నేడు పతనమయ్యాయి. ముఖ్యంగా అమెరికా బాండ్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.