ముంబై:స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే స్థితిని కొనసాగించాయి. తయారీ రంగం పుంజుకుంటోందనే సంకేతాలు ఇందుకు కారణం. మదుపర్ల నమ్మకం బల పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 504 పాయింట్లు లాభపడి 40,261 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 11,814 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ (6.51%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (4.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.02%), సన్ ఫార్మా (3.39%)బాగా లాభాల్ని గడించాయి. ఎన్టీపీసీ (-3.75%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.48%), నెస్లే ఇండియా (-1.08%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.94%)బాగా నష్ట పోయాయి.