అమరావతి: ‘భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు. కానీ బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికినట్లు సోషల్ మీడియాలో హేళనలు వెల్లువెత్తుతున్నాయని వైకాపా నేత విజయ సాయి రెడ్డి ట్వీట్లో వ్యాఖ్యా నించారు.‘ రాంగ్ మార్చ్, ఒక్క పూట దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాది పాటు జీవి స్తాయని నెటిజన్లు వ్యాఖ్యా నించారని’ తెలిపారు. ‘ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన ఎందుకూ కొరగాని అభ్యర్థులను బరిలో నిలిపిందనే విషయాన్ని వంశీ వెల్లడించార’ని పేర్కొన్నారు. ‘చంద్రబాబు ఆదేశాల మేర కే గన్నవరంలో పవన్ సీపీఐ అభ్యర్థిని పోటీకి దింపారనీ వంశీ అంతఃపుర రహస్యాలు బయటపెట్టాడ’ని వివరించారు. ఆఖరికి జన సేన అభ్యర్థుల బి-ఫారాలు సైతం తెదేపా ద్వారానే వెళ్లినట్టు తెలిసిందని వ్యాఖ్యానించారు.