రాంచి: జార్ఖండ్ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు సంభవించింది. సంకీర్ణ సర్కారు నుంచి జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) నుంచి శనివారం వైదొలగింది. ‘మీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మా పార్టీ -జార్ఖండ్ వికాస్ మోర్చా డిసెంబర్ 24, 2019న మద్దతిచ్చింది. కూటమి భాగస్వామి- కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని జేవీఎంను చీల్చేందుకు ప్రయత్ని స్తు న్నట్లు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అందువల్ల మీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చుకోవాలని నిర్ణయించామ’ని బాబులాల్ మారాండీ ముఖ్యమంత్రి హేమంత సొరేన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. జేవీఎం శాసనసభ్యులు ప్రదీప్ యాదవ్, బంధు టిక్రీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు వార్తలు రావడంతో వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారని ఊహాగానాలు వచ్చాయి. రాహుల్ గాంధీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్‌లను కూడా వారు కలవ డంతో ఊహాగానాలకు బలం చేకూరింది. జార్ఖండ్ శాసనసభలో ముగ్గురు జేవీఎం సభ్యులున్నారు. ఇద్దరు వెళ్లిపోతే ఒక్కరే మి గు లు తారు. జేవీఎం మద్దతు ఉపసంహరించుకున్నా హేమంత్ సోరేన్ సర్కారుకు ముప్పు లేదు.